ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మహీష’. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ మహీష చిత్రాన్ని వివిధ జానర్స్ కలిపి ఆసక్తికరంగా దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కించారన్నారు. మహీష మూవీలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం కలిగిందన్నారు. పాటలకు రెస్పాన్స్ బాగుందన్నారు. టీజర్‌కు మంచి వ్యూస్ వస్తున్నాయన్నారు. సినిమా కూడా మీ అందరికీ నచ్చేలా ఉంటుందన్నారు. దర్శకుడు, హీరో ప్రవీణ్ కె.వి.మాట్లాడుతూ మహీష సినిమాను మా టీమ్ అంతా ఎంతో కష్టపడి రూపొందించామన్నారు. సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు.
