‘మైదాన్‌’ ట్రైలర్‌ విడుదల

Apr 2,2024 19:20 #ajay devagan, #movie

బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగణ్‌ పుట్టినరోజైన మంగళవారం నాడు ఆయన నటించిన కొత్త చిత్రం ‘మైదాన్‌’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అమిత్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫుట్‌బాల్‌ కోచ్‌గా ఆయన నటించారు. ‘మైదానం బయట మీ 11 మంది వేర్వేరు కావొచ్చు. ఒక్కసారి ఆట బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ వ్యూహం ఒకేలా ఉండాలి’ అంటూ అజయ్ దేవ్‌గన్‌ డైలాగ్‌ బాగా ఆకట్టుకుంటుంది. భారత ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అబ్దుల్‌ సతీమణిగా ప్రియమణి నటించారు. జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 10న ఈ సినిమా విడుదల కానుంది.

➡️