కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మరో సినిమాలో నటించబోతున్నారు. ‘వీర సింహారెడ్డి’ సినిమాతో తనకు హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ గురించి జరిగిన చర్చలు ఫలప్రదం కావటంతో త్వరలో అధికారిక ప్రకటన రానుంది. జాట్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మలినేని మెప్పించారు. తెలుగులో ఆయన నిర్మించిన క్రాక్ కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వృద్ధి సంస్థ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సంస్థ నుంచి ఇప్పటికే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతోంది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2: తాండవం’ దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.
