హైదరాబాద్ : ”నేను ఎవరిని ఆస్తి అడగలేదని, మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని నన్ను కాలుస్తున్నారని” నటుడు మంచు మనోజ్ అని అన్నారు. విచారణకు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాపై దాడి చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన దాడికి గురైన మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు. తన బంధువులపై దాడి చేశారని, ఆ సమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలో వినయ్ అనే వ్యక్తి దాడి చేశారని తెలిపారు. దీని సంబంధించిన సిసి ఫూటేజ్ ను పరీలించాలని కోరారు. భార్య, ఏడేళ్ల పాపను లాగుతున్నారని కంటనీరు పెట్టుకున్నారు. ఇన్ని రోజులు ఆగానని, ఇక ఆగలేనని జరిగిన మొత్తాన్ని ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.
