‘డబుల్‌ ఇస్మార్ట్‌’కీ మణిశర్మ

Nov 24,2023 19:02 #movie, #ram

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజరు దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుపుతూ రామ్‌, పూరీజగన్నాథ్‌, మణిశర్మ, చార్మీతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ చిత్రం 2024 మార్చి 8న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

➡️