ప్రేక్షకులు ఆదరించేలా ‘మంజుమ్మల్‌ బాయ్స్’

‘మంజుమ్మల్‌ బాయ్స్’ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నిర్మాత వివేక్‌ కూచిభొట్ల అన్నారు. సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌బాసి ప్రధాన పాత్రల్లో చిదంబరం ఎస్‌ పొదువల్‌ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్’. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఇదే చిత్రం తమిళ వెర్షన్‌లోనూ హిట్‌ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో ఈ చిత్రాన్ని ఈనెల ఆరోతేదీన విడుదల చేయబోతున్నారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పిస్తున్నారు. గురువారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిర్మాతలు వివేక్‌ కూచిభొట్ల, శశిధర్‌రెడ్డి, నవీన్‌ యెర్నేని, నిరంజన్‌రెడ్డితోపాటుగా చిత్రయూనిట్‌ సభ్యులంతా పాల్గొన్నారు.

➡️