మాస్‌ జాతర నుంచి ‘తు మేరా లవర్‌’ విడుదల

హైదరాబాద్‌ బ్యూరో : మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘తు మేరా లవర్‌’ను విడుదల చేశారు.

ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘తు మేరా లవర్‌’ గీతం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూశారు. తాజాగా విడుదలైన ఈ పాట, ఒక్కసారి వినగానే శ్రోతలకు అభిమాన గీతం మారిపోతోంది. ధమాకా జోడి రవితేజ-శ్రీలీల అందరి అంచనాలను అందుకునేలా, అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాజిక్‌ చేశారు. ప్రేక్షకులకు వెండితెరపై పూర్తి స్థాయి ట్రీట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పాటతో చెప్పకనే చెప్పేశారు.

సంగీత సంచలనం భీమ్స్‌ సిసిరోలియో ‘తు మేరా లవర్‌’ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. భాస్కరభట్ల సాహిత్యం మాస్‌ మెచ్చేలా ఉంది. రవితేజ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇడియట్‌’లోని ఐకానిక్‌ చార్ట్‌బస్టర్‌ ”చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే” పాటకు ట్రిబ్యూట్‌ గా మలిచిన ‘తు మేరా లవర్‌’ అభిమానులకు విందు భోజనంలా ఉంది. దీనిని ఒక ప్రత్యేకమైన సంగీత నివాళిగా మార్చడానికి నిర్మాతలు కఅత్రిమ మేధస్సు ని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి సృష్టించారు. రవితేజ శైలి ప్రత్యేక డ్యాన్స్‌ స్టెప్పులు, శ్రీలీల అద్భుతమైన నఅత్య ప్రదర్శనతో ఈ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు భాను బోగవరపు రవితేజ అభిమానులతో పాటు, మాస్‌ ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘మాస్‌ జాతర’ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న తన ప్రభావవంతమైన విజువల్స్‌ తో పాటకి తగ్గట్టుగా మాస్‌ వైబ్‌ను అద్భుతంగా చూపించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్‌ నూలి ఎడిటర్‌ గా వ్యవహరిస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ‘మాస్‌ జాతర’ రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తారాగణం – సాంకేతిక బృందం :

చిత్రం: మాస్‌ జాతర
తారాగణం: మాస్‌ మహారాజా రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను బోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
కూర్పు: నవీన్‌ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌
బ్యానర్స్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌,
పీఆర్‌ఓ: లక్ష్మీవేణుగోపాల్‌

➡️