‘మట్కా’ అజయ్ ఘోష్‌

వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న ‘మట్కా’ చిత్రం నవంబరు 14న విడుదలకు సిద్ధంగా ఉంది. కరుణకుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ ఘోష్‌ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఆయన పోస్టర్‌ని చిత్రబృందం విడుదలచేసింది. ‘గోల్డెన్‌ హార్ట్‌ అండ్‌ అచంచలమైన చిత్తశుద్ధితో కూడిన విధేయతతో కూడిన ఆత్మ.. అంటూ ఈ లుక్‌ షేర్‌ చేశారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మట్కాలో కథానుగుణంగా వైజాగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండే పూర్ణా మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాలను రీక్రియేట్‌ చేశారు.

➡️