‘మట్కా’ పూర్ణా మార్కెట్‌

Oct 10,2024 23:29 #movies, #varun tej

నాగార్జున హీరోగా నటించిన ‘శివమణి’ సినిమాలో వచ్చే పూర్ణా మార్కెట్‌ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ పూర్ణా మార్కెట్‌ను సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రేక్షకులు చూడబోతున్నారు. వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న ‘మట్కా’ సినిమా కోసం వింటేజ్‌ వైజాగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో పూర్ణా మార్కెట్‌ (ప్రస్తుతం లేదు) తోపాటు పలు ప్రాంతాలను రీక్రియేట్‌ చేశారు. ‘పూర్ణా మార్కెట్‌.. మట్కా.. బిహైండ్‌ ది గేమ్‌.. యాక్ట్‌ 1’ అంటూ తాజాగా మేకర్స్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం కోసం మేకర్స్‌ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్‌ వైజాగ్‌ లొకేషన్స్‌ రీక్రియేషన్‌ చేశారు. పలాస 1978 ఫేం కరుణకుమార్‌ దర్శకత్వంలో పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 14న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.

➡️