లండన్ : మెగాస్టార్ చిరంజీవి లండన్‌కు చేరుకున్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ హౌస్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించనున్న సంగతి తెలిసిందే. సినీ, సేవా రంగాల్లో విశేష కృషి చేసిన చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించనుంది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో మార్చి 19న ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. దీనికోసం చిరంజీవి లండన్ చేరుకున్నారు. లండన్‌లో చిరంజీవిని చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ‘వెల్‌కమ్ అన్నయ్యా’ అంటూ ఫ్లెక్సీలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. చిరంజీవి వారితో కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
