మలయాళ హిట్‌మూవీ ‘సూక్ష్మదర్శిని’ హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎంసి జితిన్. ప్రముఖ మలయాళ నటులు నజరియా, బసిల్‌జోసెఫ్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించి అలరించారు. ‘ఇరుగుపొరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే. అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు’ అనే ఇతివృత్తంతో కథ సాగుతుంది. కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది.
