‘ఫౌజీ’లో మిథున్‌

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఫౌజి’ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి నటిస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల మిథున్‌కి కేంద్ర అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ సినిమాకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తుండగా సుదీప్‌ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్‌తో పాటు అలనాటి నటి జయప్రద నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

➡️