TG – హైకోర్టులో మోహన్‌బాబు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

తెలంగాణ : రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ … సినీనటుడు మోహన్‌బాబు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మోహన్‌బాబు పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అదేవిధంగా తన ఇంటి వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను పోలీసులను సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా కనీస భద్రత కల్పించలేదని.. వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, మోహన్‌ బాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు నగేష్‌ రెడ్డి, మురళి మనోహర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మోహన్‌బాబు గత మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటెల్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆసుపత్రి బృందం ఒక హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️