ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. ఈ సినిమాకు రవి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్ పాండు రంగారావు, చిన్నా రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఒక సెలబ్రిటీగా మారాలనుకునే యువకుడి కథనే సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా సీనియర్ నటి ఆమని,శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షఉటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.