మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్”. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియట్” సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో “మిస్టర్ ఇడియట్” సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
అతిథిగా వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ – రవితేజ గారు ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. నన్ను కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. ఈ ఫంక్షన్ కు పిలిచినప్పుడు మాధవ్ ను సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి వచ్చాను. నేనే కాదు ఇండస్ట్రీలో చాలా మంది మాధవ్ ను సపోర్ట్ చేస్తారు. సీసీఎల్ కు వెళ్లినప్పుడు రఘు గారు ఒక సాంగ్ చూపించారు. అది “మిస్టర్ ఇడియట్” లో మాధవ్ చేసిన సాంగ్. చాలా బాగుంది ఎవరు హీరో అని అడిగితే మా అబ్బాయి అని చెప్పారు. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. ఆ సినిమాలో హీరోయిజం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. మాధవ్ సినిమాకు మిస్టర్ ఇడియట్ అనే పేరు పెట్టడం బాగుంది. చాలా ఎనర్జిటిక్ గా నటించాడు మాధవ్. రవితేజ గారి స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నా. మా సినిమా బాగుందని అనుకోవడం వేరు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరిచేసుకున్నాం అని చెప్పడం గొప్ప విషయం. ఈ టీమ్ అలాంటి కరెక్షన్స్ చేసుకుంది అంటే సక్సెస్ అందుకున్నట్లే అనిపిస్తోంది. నవంబర్ లో రిలీజ్ అవుతున్న “మిస్టర్ ఇడియట్” సినిమాను అందరూ చూడండి. డైరెక్టర్ గౌరి గారికి, ప్రొడ్యూసర్ రవిచంద్ గారికి ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ గౌరి రోణంకి మాట్లాడుతూ – “మిస్టర్ ఇడియట్” సినిమాకు మా టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. మ్యూజిక్ డైరక్టర్ అనూప్ గారికి సినిమా ప్రారంభంలోనే చెప్పాను. మీ మ్యూజిక్ తో సినిమా హిట్టై పోవాలని. ఆయన మా కథను అర్థం చేసుకుని మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఫైట్స్, డ్యాన్స్ విషయాల్లో నాకు ఎక్కువగా తెలియదు. కానీ నేను చెప్పిన సజెషన్స్ తీసుకుంటూనే వాళ్లంతా మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రవిచంద్ గారికి థ్యాంక్స్. మాధవ్, సిమ్రాన్ గురించి చాలా చెప్పాలి. ఈ మూవీలో వాళ్ల నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యే అంశాలతో మూవీ రూపొందించాను. త్వరలోనే “మిస్టర్ ఇడియట్” థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండా మీ బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో మాధవ్ మాట్లాడుతూ – ఫస్ట్ టైమ్ మీడియా ముందు మాట్లాడుతున్నా. “మిస్టర్ ఇడియట్” ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి థ్యాంక్స్. అలాగే నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. మా సినిమాను మీ ముందుకు తీసుకురావడంలో కొద్దిగా లేట్ అయ్యింది. మేము శాటిస్వై అయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయొద్దని భావించాం. అందుకే కొంత లేట్ అయినా పర్పెక్ట్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశాం. మీ అందరికీ “మిస్టర్ ఇడియట్” ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నా. అనూప్ గారి మ్యూజిక్ హైలైట్ అవుతుంది. అలాగే రామ్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. మా డైరెక్టర్ గౌరి గారు నాకు ఒక మంచి మూవీ ఇస్తున్నారు. నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్. మా పెదనాన్న రవితేజ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. “మిస్టర్ ఇడియట్” సినిమా నవంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ – “మిస్టర్ ఇడియట్” ట్రైలర్ రిలీజ్ లో బాగా మాట్లాడేందుకు ప్రిపేర్ అయ్యా. కానీ మీ అందరి ఎనర్జీ చూశాక మాటలన్నీ మర్చిపోయా. ట్రైలర్ రిలీజ్ కు వచ్చినదానికంటే వెయ్యింతల ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమాలో వర్క్ చేయడం బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. డైరెక్టర్ గౌరీ ఒక ఫ్రెండ్ లా ఎంకరేజ్ చేసింది. అలాగే మాధవ్ ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. తనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. నవంబర్ లో మా మూవీ రిలీజ్ కు వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.