ఓటీటీలో ‘ముఫాసా..’

Mar 12,2025 18:59 #movies, #mufasa, #OTT

‘ముఫాసా : ది లయన్‌ కింగ్‌’ ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్‌ని చిత్రబృందం ప్రకటించింది. ‘ది లయన్‌ కింగ్‌’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో దాదాపు రూ.100 కోట్ల వసూలు చేసింది. తెలుగులో ముఫాసా పాత్రకు మహేశ్‌ బాబు డబ్బింగ్‌ చెప్పగా.. బాలీవుడ్‌ హిందీ వెర్షన్‌కి షారుఖ్‌ ఖాన్‌ డబ్బింగ్‌ చెప్పాడు. ఈ చిత్రం మార్చి 26 నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్‌, హిందీ, తమిళం భాషల్లో ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది.

➡️