నాగచైతన్య సినిమా స్పెషల్‌ వీడియో

‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మించనున్నారు. ‘ఎన్‌సీ 24’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ఇటివలే లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘ఎన్‌సీ 24-ది ఎక్స్‌కవేషన్‌ బిగిన్స్‌’ అంటూ స్పెషల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో మూవీ టీం వర్కింగ్‌ గురించి చూపించారు. చివర్లో నాగచైతన్య లుక్‌ రివీల్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ బుధవారం నుండి మొదలైంది.

➡️