‘ఆకాష్‌ జగన్నాథ్‌’గా పేరు మార్పు

Jul 25,2024 20:26 #New Movies Updates, #puri jaganadh

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమార్‌ ఆకాశ్‌ పూరి తన పేరుమార్చుకున్నాడు. గురువారంనాడు తన పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. బాల నటుడిగా సినిమాల్లో నటించిన అతడు ఆ పై హీరోగా కూడా మెప్పిస్తున్నాడు. 2022లో ‘చోర్‌బజార్‌’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా ప్లాప్‌ అయ్యింది. ఆ తర్వాత రెండేళ్లుగా సినిమాలేవీ చేయలేదు. ఆ తర్వాత ఎక్కడా సినిమా ప్రకటన రాలేదు. చాలారోజుల తర్వాత ఓ కాతింగ్‌ బ్రాండ్‌కి ఆకాశ్‌ అంబాసిడర్‌గా కనిపించాడు. తాజాగా తన పేరును ‘ఆకాశ్‌ జగన్నాథ్‌’గా మార్చుకున్నాడు. 2018లో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2007లో ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆపై ‘బుజ్జిగాడు’,’ఏక్‌ నిరంజన్‌’, బిజినెస్‌మేన్‌, గర్బర్‌సింగ్‌ వంటి చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెరిశాడు. ఆ తర్వాత 2015లో ఆంధ్రాపోరి, మెహబూబా, , రొమాంటిక్‌ వంటి సినిమాల్లో నటించాడు. తాజాగా కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నట్లుగా సమాచారం.

➡️