మంచి నిర్ణయమే తీసుకున్నా నిధి అగర్వాల్‌

‘ఈ ఏడాది నాకు తిరిగి పుంజుకున్న సంవత్సరంలా అనిపిస్తుంది. ఎందుకంటే ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నా. దానికి సీక్వెల్‌ ఉండటం నాకు కలిసొచ్చిన విషయం. ఈ సినిమా ఐదేళ్లుగా నిర్మాణంలో ఉంది. అందువల్ల కొత్త ప్రాజెక్టులపై నేను సంతకం చేయలేకపోయా. అయితే నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? లేదా అనేది ఆలోచించిన రోజులు ఉన్నాయి. సినిమా ఆలస్యమైనందున ప్రేక్షకులు నన్ను మరచి పోతారనే భయాన్ని కొందరు ప్రసారం చేశారు. నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా అలాంటి ఆలోచన లను ప్రోత్సహించారు. అయినా నేను నా వరకూ సినిమా పూర్తయ్యే వరకూ ఎలాంటి రూమర్స్‌ గురించి పట్టించుకోకుండా పనిచేస్తున్నా. చిన్నప్పుడు నటి కావాలని కోరుకున్నా. ఇప్పుడు గుర్తింపు వచ్చింది. పెద్ద సినిమాల్లో అవకాశాలు రావటం బోనస్‌గా భావిస్తున్నా’ అని కథానాయిక నిధి అగర్వాల్‌ అన్నారు. పవన్‌కళ్యాణ్‌ కథా నాయకుడిగా, నిధి అగర్వాల్‌ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి పార్టు మే 9న విడుదల కానుంది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

➡️