కొణిదెల నీహారిక తన నిర్మాణంలో ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రెండో ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు. తన ప్రాజెక్టులలో చిరకాలంగా అసోసియేట్ అయిన మానసశర్మకు అవకాశం ఇస్తున్నారు. ఆమె దర్శకత్వంలో రెండో సినిమా నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు. మానసశర్మ గతంలోనే నిహారిక దగ్గరే క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉంటూ వస్తున్నారు. ఒక చిన్న ఫ్యామిలీ వెబ్‌సిరీస్ ‘బెంచ్ లైఫ్’ చేశారు. సినిమా చేయడం ఇదే తొలిసారి. కమిటీ కుర్రాళ్ల సినిమా మేకింగ్ విషయంలోనూ, ప్రొడక్ట్‌ను లాంచ్‌చేసే విషయంలో నిహారిక చాలా చురుగ్గా వ్యవహరించారు. తాజా ప్రాజెక్టుకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే చిత్ర విశేషాలను వెల్లడిస్తామని నిహారిక వెల్లడించారు.
