28న ‘శబ్దం’

Feb 4,2025 20:54 #adhi pani shetty, #movies

ఆది పినిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. ‘వైశాలి’ ఫేమ్‌ అరివళిగన్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధమైనట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ ఆది పినిశెట్టి పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. 7జి ఫిల్మ్స్‌ శివ, అల్ఫా ఫ్రేమ్స్‌ బ్యానర్స్‌పై భానుప్రియ, శివ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మనోజ్‌ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాంలగా రూపొందుతున్న ఈ చిత్రంలో లక్ష్మీ మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారర్‌ నేపథ్యంలో వస్తున్న ఆ సినిమాలో సీనియర్‌ నటి లైలా కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

➡️