అలాంటి నటుడ్ని కాదు

అమీర్‌ఖాన్‌ తన కలల ప్రాజెక్ట్‌ ‘మహాభారతం’ గురించి తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. అందులో తను ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారో వెల్లడించారు. ‘మహాభారతం’ను తెరకెక్కించడం నా కల. దీనికోసం ఎంతో కష్టపడాలి. ఇందులో కృష్ణుడి పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అది నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఆ క్యారెక్టర్‌లో కనిపించాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో తాను నటించిన ఎన్నో సినిమాలకు రెమ్యూనరేషన్‌ తీసుకోలేదని అన్నారు. ‘నా సినిమాలకు వచ్చే లాభాల్లో షేర్‌ తీసుకుంటాను. సినిమా హిట్‌ అయితేనే నాకు పేమెంట్‌ వస్తుంది. లేకపోతే ఉండదు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’కు నాకు రూపాయి కూడా అందలేదు. అయినా ఆ విషయంలో బాధపడను. ఎందుకంటే ఇలా చేయడం సరైనదని నా అభిప్రాయం. సినిమా ఫ్లాప్‌ విషయంలో నేను కూడా బాధ్యత వహించాలి కదా అని నా ఆలోచన. ‘షూటింగ్‌లో ఇన్ని రోజులు పాల్గొన్నాను కాబట్టి సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. నా పారితోషికం నాకు ఇవ్వండి’ అని నిర్మాతలను అడగలేను. అలాంటి నటుడిని కాదు నేను’ అని అమీర్‌ చెప్పారు.

➡️