ఎస్‌ఆర్‌ఎస్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నం.1గా నిర్మితమవుతున్న సినిమా ‘ఓ చెలియా..’. నటుడు నాగ ప్రవణ్, కావేరీ, ఆద్య, అజరుఘోష్ తదితరులు ప్రధాన తారాగణం. కోపూరు రూపశ్రీ నిర్మాత, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎం.నాగరాజశేఖర్‌రెడ్డి వహిస్తున్నారు. సంగీతం ఎంఎం కుమార్. డిఒపి సురేష్‌బాల, ఎడిటర్ ఉపేంద్ర, రచన ఆలీ, చంద్రమౌళి కోపూరు. తుది షెడ్యూల్‌ను పూర్తిచేస్తూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చేస్తున్నారు. ప్యాచ్‌వర్క్‌ను కూడా పూర్తిచేస్తున్నారు. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత రూపశ్రీ, దర్శకుడు నాగరాజశేఖర్‌రెడ్డి తెలిపారు.