కొత్త సినిమాల్లో పాత జోడీలు

Apr 14,2025 04:49 #jouthika, #moives, #surya, #trisha

సినిమా హిట్టా…పట్టా అనేది కథ,కథనం, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు ఇలా అన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటితోపాటుగా నటనలో కథానాయకుడు, కథానాయికల ఎంపికా కీలకమే. వారి ప్రతిభ కూడా సినిమా జయాపజయాలుపై ఆధారపడివుంటుంది. అందుకే దర్శక, నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కోస్టార్‌తో కెమిస్ట్రీ కుదిరితే ఇద్దరూ నటనలో ఆకట్టుకుంటారు. అందుకే రిపీట్‌ జోడీలను దర్శకులు ఎంపిక చేస్తుంటారు. నాడు-నేడు, పాత-కొత్తతరం నటీనటులు ఈ ఒరవడిని కొనసాగిస్తున్నారు. పాతతరంలో శ్రీదేవి, కృష్ణకుమారి, జమున, వాణిశ్రీ, జయసుధ, జయప్రదలతో ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌, కృష్ణ ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కృష్ణంరాజు, శోభన్‌బాబు కూడా నటించారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ రాధిక, రాధా, సుహాసిని, విజయశాంతిలతో నటించారు. వెండితెరపై హిట్‌ అయిన జోడీలను మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. కథ కుదరటం, ఇద్దరి డేట్స్‌ సెట్‌ అయ్యి వెంటనే రిపీట్‌ అయిన జోడీలు చాలానే ఉన్నాయి. ఎన్నో ఏళ్లకు గానీ రిపీట్‌ అయ్యే జోడీలూ ఉన్నాయి. నందమూరి బాలకృష్ణతో విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్‌ ఎక్కువ సినిమాలు చేశారు. కెరీర్‌లో కొత్త హీరోయిన్లతో ఆయన జతకడుతున్నారు. అలా కొన్నేళ్ల తర్వాత రిపీట్‌ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.

దాదాపు పద్దెనిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్లుగా చిరంజీవి, త్రిష స్క్రీన్‌ షేర్‌ చేసు కుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘స్టాలిన్‌’ 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. బింబిసార ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. సిస్టర్‌ సెంటిమెంట్‌తోపాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ కూడా ఈ కథలో ఉంటాయని సమాచారం.

రాజేంద్రప్రసాద్‌-అర్చన కలిసి నటించిన ‘లేడీస్‌ టైలర్‌’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1986లో విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. వీరితోపాటుగా రూపేష్‌, ఆకాంక్షసింగ్‌ లీడ్‌రోల్స్‌లో, అచ్యుత్‌కుమార్‌, శకుంతల కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పవన్‌ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. లేడీస్‌టైలర్‌, షష్ఠిపూర్తి సినిమాలకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. కుటుంబ విలువలు, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపేష్‌ నిర్మించారు.

మలయాళ సిల్వర్‌ స్క్రీన్‌పై మోహన్‌లాల్‌, శోభనల జోడీ సూపర్‌హిట్‌. ‘ఆవిడతే పోలే ఇవిడెయుమ్‌’ (1985) సినిమాలో మొదటిసారి వీరిద్దరూ జతకట్టారు. ఆ తర్వాత మణిచిత్ర తాళు, నాడోడిక్కట్టు వంటి హిట్‌ సినిమాలు 50కిపైగా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘తేన్మావిన్‌ కొంబాట్‌’లోనూ నటించారు. మోహన్‌లాల్‌ 360వ చిత్రంలో శోభన కలిసి నటించిన చిత్రం 56వది.

దాదాపు పాతికేళ్ల క్రితం తమిళ చిత్రం ‘పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌’ (1999)లో తొలిసారి సిల్వర్‌స్క్రీన్‌పై సూర్య, జ్యోతిక కనిపించారు. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు, పేరళగన్‌, కాక్క కక్క, మాయావి వంటి సినిమాల్లో నటించి హిట్‌ జోడీగా నిలిచారు. 2006లో ‘సిల్లున్ను ఒరు కాదల్‌’ సినిమాలో నటించారు. విడుదలైన తర్వాత రియల్‌లైఫ్‌ జోడీ కూడా అయ్యారు. 18 సంవత్సరాల తర్వాత అంజలీమీనన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

రామ్‌చరణ్‌-కియారా అద్వానీ కలిసి నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. గేమ్‌ఛేంజర్‌లోనూ వీరిద్దరూ కలిసి నటించారు.’లవ్‌స్టోరీ’లో నటించిన నాగచైతన్య-సాయిపల్లవి జంట ‘తండేల్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచాయి. ‘వెంకీమామ’లో నాగచైతన్య, రాశీఖన్నా జంట ‘థ్యాంక్యూ’తో మెప్పించింది. నాని-కీర్తిసురేష్‌ ‘నేను లోకల్‌’ సినిమాతో జంటగా నిలిచి ‘దసరా’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఖుషీతో జట్టు కట్టిన విజరుదేవరకొండ-సమంత ‘మహానటి’తో అలరించారు.

ETV WIN

సీనియర్‌ కథానాయికుల హవా…

కథానాయిక త్రిష అజిత్‌ సరసర ‘విడాముయర్చి’, మోహన్‌లాల్‌తో ‘రామ్‌’, కమల్‌హాసన్‌తో ‘థగ్‌లైఫ్‌’, టొవినో థామస్‌తో ‘ఐడెంటిటీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. పెళ్లి తర్వాత వరుస సినిమాలతో నయనతార దూసుకెళ్తున్నారు. షారూక్‌ఖాన్‌ సరసర ‘జవాన్‌’లో నటించగా ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇరైవన్‌, అన్నపూరణిలతో అలరించారు. నయనతార, మాధవన్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టెస్ట్‌’. 2005లో తెరంగ్రేటం చేసిన తమన్నా సినిమాలతోనే కాకుండా వెబ్‌సిరీస్‌లతోనూ అలరిస్తున్నారు. భోళాశంకర్‌, బాంద్రా, జీ కర్దా, అఖిరీ సచ్‌ వెబ్‌సిరీస్‌లలో మెప్పించారు. ‘బాక్‌’ చిత్రం అలరించింది. కాజల్‌ అగర్వాల్‌ ‘భగవంత్‌కేసరి’లో బాలకృష్ణతో కలిసి పనిచేశారు. భారతీయుడు 2లో కమల్‌హాసన్‌తో కలిసి నటించారు.

సత్యభామతో అలరించారు. అనుష్కశెట్టి 2020లో వచ్చిన ‘నిశ్శబ్ధం’ తర్వాత ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’లో నటించారు. అనుష్కశెట్టి 2020లో వచ్చిన ‘నిశ్శబ్ధం’ తర్వాత మూడేళ్లపాటు గ్యాప్‌ తీసుకున్నారు. నవీన్‌పోలిశెట్టితో కలిసి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’లో నటించారు. క్రిష్‌ దర్శకత్వంలో ‘ఘాఠి’, మలయాళంలో రోజిన్‌ థామస్‌ డైరెక్షన్‌లో ‘కథనార్‌’లో నటించారు. నాగార్జునతో కలిసి పలు సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ ‘బంగార్రాజు’తో సరికొత్త హిట్‌ను అందుకున్నారు. కొడుకులు దిద్దిన కాపురంలో సీనియర్‌ నటుడు కృష్ణతో కలిసి నటించిన విజయశాంతి ఆయన తనయుడుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించారు. నందమూరి కళ్యాణ్‌రామ్‌తో కలిసి ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమాలో తల్లిగా నటించారు. 22 సంవత్సరాల తర్వాత ఆమె వెండితెరపై మెరుస్తున్నారు.

➡️