‘నేటి యువతీ యువకులు ఆకర్షణతో ప్రేమలో పడుతున్నారు. అభిప్రాయాల కలబోత పేరుతో ప్రేమపక్షుల్లాగా ఉంటున్నారు. కానీ పెళ్లి బాసల ప్రస్తావన ఉండదు. కుదిరితే సరి. లేదంటే ఎవరికి దారి వారిదే.. ఈ బంధం ప్రేమకి తక్కువ. స్నేహానికి ఎక్కువ. ఈ కాలం యువత బంధాలు, అనుబంధాలు.. కెరీర్ విషయంలో ఎలా ఉంటున్నారో ‘ఆరోజు ఏమి జరిగిందంటే..’లో చెబుతున్నాం.” అని దర్శకుడు బాందేపురపు మూర్తి అన్నారు. శ్రీ స్వర్ణ వరల్డ్ మూవీస్ బ్యానర్‌పై బి.నాగవర్థనీ సమర్పణలో మూర్తీ నంబర్ కథానాయకుడుగా ఈ క్రైంస్టోరీగా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత మూర్తి బాందేపురపు. నిర్మాత ఎం.మల్లిబాబు. సంగీతం చదివే దేవేంద్ర.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/movie-2.jpg)