ఒకే వేదికపై …

May 16,2024 20:10 #actor Allu Arjun, #movies, #prabhas

ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతియేట డైరెక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 4న జరగాల్సిన ఈ వేడుక మే 19కి వాయిదా పడింది. ఈ వేడుకలకు ఇంకా మూడు రోజులే ఉండటంతో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా చిరంజీవితో పాటు, వెంకటేష్‌, నాని పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. తాజాగా ఈ వేడుకకు సంబంధించి మరో న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ వేడుకలో ప్రభాస్‌, అల్లు అర్జున్‌ హాజరు కానున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు టీఏఫ్‌డీఏ ప్రకటించింది.

➡️