‘ఆపరేషన్‌ రావణ్‌’ మూవీ బాగా వచ్చింది

రక్షిత్‌ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఆపరేషన్‌ రావణ్‌’. ధ్యాన్‌ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. హీరోయిన్‌గా విపిన్‌ నటిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్‌ను బుధవారంనాడు మేకర్లు విడుదల చేశారు. హీరో విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ రావణ్‌’ హిట్‌ సినిమాగా నిలువబోతుందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీపాల్‌ చొల్లేటి మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ రావణ్‌’ సినిమాకు తాను పనిచేయడం హ్యాపీగా ఉంది. సినిమా బాగా వచ్చింది. మీ అందరి సపోర్ట్‌ మా టీమ్‌ కు ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు. పూర్ణాచారి, హీరోయిన్‌ సంగీర్త విపిన్‌, కమెడియన్‌ రాకెట్‌ రాఘవ, రైటర్‌ లక్ష్మీ లోహిత్‌, ప్రణవం, ఎడిటర్‌ సత్య, డైరెక్టర్‌ వెంకట సత్య, హీరోలు రక్షిత్‌ అట్లూరి మాట్లాడారు.

➡️