ఆస్కార్ అవార్డుల రేసులో ఈ ఏడాది దక్షిణ భారత దేశంలో భారీగానే సినిమాలు పోటీపడుతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం నుంచి పలు సినిమాలు ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాదికి మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలను గుర్తించి వాటిని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈ మేరకు ఇండియాన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. 2025 ఆస్కార్‌కు లాపతా లేడీస్ ఎంపికైనట్లుగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి పలు భాషలకు చెందిన 29 చిత్రాల్లో లాపతా లేడీస్‌ను మాత్రమే ఎంపిక చేశారు. టాలీవుడ్ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, హనుమాన్, మంగళవారం ఉన్నాయి. ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్ లిస్టులో చోటు సంపాదించుకున్నాయి. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్‌జే సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. మలయాళం నుంచి ఆట్టం, ఆడుజీవితం (ది గోట్ లైఫ్), ఆల్ వి ఇమాజిన్ యూజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ ఇండియా నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే భారతీయ చిత్ర పరిశ్రమ ఎంపిప 29 సినిమాల్లో ‘లపతా లేడీస్’ మాత్రమే ఆస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినామాల గురించి అధికారంగా ప్రకటన రానుంది.
