మా ‘ల్యాంప్‌’ అందరికీ నచ్చుతుంది : వినోద్‌

Mar 11,2025 19:35 #moives

‘ప్రస్తుతం ప్రేక్షకులు చిన్న, పెద్ద అని సినిమాలను చూడటం లేదు. కంటెంట్‌ ఉన్న ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. కథ నచ్చితే హిట్‌ చేస్తున్నారు. అందువల్లనే చిన్న సినిమాలు సైతం హిట్‌ అవుతున్నాయి. మా ‘ల్యాంప్‌’ సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది.ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఒక క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. వరుస హత్యలు జరుగుతున్న నేపధ్యంలో వాటిని హీరో ఎలా చేధించాడు అనేది కామెడిగా చూపిస్తూనే ఫైనల్‌గా అసలు ఏమి జరిగింది. ఎలా వాటిని ఆపాడు అనేది ఆసక్తికరంగా చూపించాం. సస్పెన్స్‌ మెయింటైన్‌ చేస్తూనే కామెడీ పండించటంలో నా పాత్ర హైలెట్‌’ అని కథానాయకుడు వినోద్‌ అన్నారు. వినోద్‌, మధుప్రియ, కోటి కిరణ్‌, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించారు. రాజశేఖర్‌రాజ్‌ దర్శకుడు. ఈనెల 14న ఈ సినిమా విడుదల కానుంది. వినోద్‌ మీడియాతో పై విధంగా మాట్లాడారు.

➡️