13న ‘పా…పా’ విడుదల

Nov 30,2024 19:27 #movies, #song released

తమిళంలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘డా…డా’ సినిమా తెలుగులో ‘పా…పా’ టైటిల్‌తో ఈనెల 13న విడుదల కాబోతోంది. జెకె ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయ బోతున్నారు. కవిన్‌, అపర్ణదాస్‌ ప్రధాన పాత్రధారులుగా డైరెక్టర్‌ గణేష్‌ కె బాబు తెరకెక్కించిన ‘డా…డా’ చిత్రం తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘డా…డా’ చిత్రం ‘పా…పా..’ పేరుతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత నీరజ కోట తెలిపారు. కామెడీ, భావోద్వేగం, ప్రేమ… ఇవన్నీ సరైన స్థాయిలో ఉండి ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఈ సినిమా ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజిఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయబోతున్నారన్నారు.

➡️