‘పవన్ కళ్యాణ్‌తో కొమరం పులి, మహేష్‌బాబుతో ఖలేజా లాంటి సినిమాలు తీసి రూ.100 కోట్లు వరకూ నష్టపోయా. ఆరోజుల్లో కేవలం ఏ సినిమానైనా ఏడాదిలోపే పూర్తిచేసేవాళ్లం. నా దురదృష్టం వల్లనేమో కొమరం పులి, ఖలేజా సినిమాలు నిర్మించటంలో ఎక్కువ టైమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ రెండు సినిమాలు ఆలస్యమవ్వటానికి చాలా కారణాలు ఉన్నాయి. భారీగా నష్టపోయిన నాకు ఏ హీరో కూడా సపోర్టు చేయలేదు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండిస్టీ నుంచి అయ్యోపాపం అని కనీసం పలకరించిన పాపాన పోలేదు’ అని టాలీవుడ్ నిర్మాత సింగనమల రమేష్ అన్నారు. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి రూ.12 కోట్లు స్వాహా చేశారనే అభియోగంపై రమేష్‌బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో రమేష్‌బాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది. దీంతో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.
