1న ‘పీలింగ్స్‌’ ఫుల్‌సాంగ్‌ విడుదల

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో డిసెంబర్‌ 5న విడుదల కానున్న సినిమా ‘పుష్ప 2’. ఈ పాన్‌ ఇండియా మూవీ విడుదల సందర్భంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ‘పీలింగ్స్‌’ అనే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి పాటను డిసెంబర్‌ 1న విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్‌లో వచ్చే పల్లవి లిరిక్స్‌ మలయాళంలోనే ఉండనున్నాయి. సంగీతం దేవీశ్రీ ప్రసాద్‌ అందించారు. ‘పుష్ప 2 : ది రూల్‌’ ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సుమారు ఐదు కట్స్‌ చెప్పి యూ/ఎ సర్టిఫికెట్‌ను సెన్సార్‌ బోర్డు ఇచ్చింది. సినిమా రన్‌ టైమ్‌ 3.20 గంటల 38 సెకన్లు.

➡️