విజయ్ సరసన పూజాహెగ్డే

దళపతి విజయ్ మరో సినిమాలో నటించబోతున్నారు. ఆయనకు జోడీగా హీరోయిన్‌ పూజాహెగ్డే పేరు ఖరారైంది. ఈ విషయాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రొడక్షన్‌ హౌస్‌ పూజా హెగ్డేకి స్వాగతం పలుకుతూ వీడియోను విడుదల చేసింది. ‘బీస్ట్‌’ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించారు. విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు బాబీడియోల్‌ నటిస్తున్నారు. ఈ సినిమానే విజయ్ కెరీర్‌లో ఆఖరి సినిమాగా చెబుతున్నారు. దళపతి 69 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో విజయ్ టార్చ్‌ పట్టుకుని కనిపించారు. తాజా సమాచారం ప్రకారం ఈనెల 5న సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్లు ప్రకటించారు. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘దిగోట్‌’ సెప్టెంబర్‌ ఐదోతేదీన విడుదలైన విషయం తెలిసిందే. గురువారం నుంచి ఓటీటీలో ఈ సినిమా నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

➡️