‘సారంగపాణి జాతకం’ 25కి వాయిదా

ప్రియదర్శి కథానాయకుడిగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. రూప కొడువాయూర్‌ హీరోయిన్‌. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్‌ 18న విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్‌ 25న రానున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘అన్ని వయసుల వారిని అలరించే అచ్చమైన తెలుగు సినిమా’ అని తెలుపుతూ ఈ పోస్టర్‌ రిలీజ్‌చేశారు.

➡️