మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ‘కన్నప్ప’. ఈ సినిమాలో దక్షిణాది, బాలీవుడ్‌కు చెందిన నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్నారు. ఆయన పాత్రలో ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు. రుద్ర పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ముకేశ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. మొదట శివుడి పాత్ర చేయాలని ప్రభాస్‌ను కోరగా అది కాకుండా మరో పాత్రేమైనా ఉంటే చెప్పాలని కోరగా రుద్ర పాత్రను అప్పజెప్పారు. శివుడిగా బాలీవుడ్ కథానాయకుడుగా అక్షరుకుమార్ నటిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, అక్షరుకుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మీనందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
