‘కార్తీ ఎలాంటి అనసవసర వ్యాఖ్యలు చేయలేదు. తప్పు లేకపోయినా సరే సారీ చెప్పించుకున్నారు. నార్మల్ అయితే క్షమాపణ చెప్పలేకపోయేవాడు. సినిమా రిలీజ్ ఉంది. డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ తదితరులకు ఇబ్బంది రాకూడదని చెప్పి ఉంటాడు. సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించుకుని మరీ సారీ చెప్పినట్లు పవన్‌కళ్యాణ్ ప్రచారం చేసుకున్నారు’ అంటూ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన విమర్శలు తాజాగా సంచలనంగా మారాయి. ఈ వీడియో క్లిప్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో పవన్‌కళ్యాణ్ తీరును ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకాష్‌రాజ్ చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు.
అయితే దేనికీ పవన్ కళ్యాణ్ నుంచి సమా ధానం లేదు. తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాష్‌రాజ్ హీరో కార్తీతో పవన్ సారీ చెప్పించుకున్న విషయం గుర్తించి మాట్లాడారు. తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పించుకున్నారని అన్నారు. కార్తీ హీరోగా నటంచిన ‘సత్యం సుందరం’ సెప్టెంబర్ 28న తెలుగులో విడుదలైంది. దీనికి కొన్ని రోజుల ముందు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో యాంకర్ లడ్డు గురించి ఓ ప్రశ్న అడగ్గా… అది సెన్సిటివ్ మేటర్ వద్దులెండి అని కార్తీ అన్నారు. ఇందులో ఏమీ లేనప్పటికీ…పవన్ ఈ విషయాన్ని ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఎందుకొచ్చిన సమస్యలే అని కార్తీ క్షమాపణ చెప్పారు
