పల్లెటూరి ప్రేమ కథ నేపధ్యంలో రూపొందించిన తాజా చిత్రం ‘ప్రణయ గోదావరి’. సదన్, ప్రియాంకా ప్రసాద్ నటీనటులు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారుమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. సాయికుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అనంతరం సాయికుమార్ ఒక్కరే ఉన్న పోస్టర్‌ను మేకర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఇప్పటివరకూ ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగిన చిత్రమన్నారు. అన్ని తరగతుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని వివరించారు.