అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం నుండి తాజాగా ఓ అప్‌డేట్ బయటికి వచ్చింది. హీరో ప్రసన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రసన్న సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘నేను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో భాగమైనందుకు థ్రిల్‌గా, ఉత్సాహంగా ఉన్నాను. నేనిప్పుడు చాలా విషయాలు వెల్లడించలేను.. క్షమించండి. మొదటి షెడ్యూల్ షూట్‌లో పాల్గొన్నా. ధన్యవాదాలు, మీ అందరికీ చాలా ప్రేమతో..’ అంటూ ట్వీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది (2025) సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంజరు దత్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
