‘హనుమాన్’ తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లో వరుస చిత్రాలు వస్తాయని ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ‘జై హనుమాన్’ రూపొందుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ యూనివర్స్‌లో తానొక్కడినే కాకుండా ఇతరుల దర్శకత్వం లోనూ సినిమాలు వస్తాయని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఈ యూనివర్స్‌లో మూడో చిత్రంగా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సూపర్ హీరో చిత్రం ‘మహాకాళి’ రాబోతున్నట్లు తాజాగా (గురువారం) ప్రకటించారు. సినిమా ఎనౌన్స్‌మెంట్ గ్లిమ్స్ కూడా డుదల చేశారు. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా ఆర్‌కె దుగ్గల్ సమర్ఫణలో ఆర్‌కెడి స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియాగా ఐమాక్స్ 3డీలో విడుదల చేయనున్నారు. ఇది భారతదేశం నుంచి వస్తున్న మొదటి మహిళా సూపర్ హీరో చిత్రమని మేకర్స్ అభివర్ణించారు.
