ప్రమోషనల్‌ ఈవెంట్‌కి రంగం సిద్ధం

May 21,2024 19:25 #movie, #prabhas

ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నుంచి తాజా అప్డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. ఈ రోజు (మే 22) రామోజీ ఫిలిం సిటీలో ప్రమోషనల్‌ ఈవెంట్‌ జరగబోతుందని చిత్రబృందం తెలియజేసింది. ‘మా బుజ్జి, భైరవను కలవండి..’ అంటూ ఇచ్చిన ఈ అప్డేట్‌ ప్రభాస్‌ అభిమానులను తెగ ఖుషీ చేస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని జూన్‌ 27న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ భైరవ పాత్రలో నటిస్తుండగా.. ప్రభాస్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ బుజ్జిగా కారు కనిపించనుంది. దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

➡️