సిద్ధమవుతున్న జాంబిరెడ్డి -2

తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. అయితే జాంబీ రెడ్డి – 2 దర్శకత్వ బాధ్యతల నుంచి ప్రశాంత్‌ వర్మ తప్పుకున్నారు. ఈ సీక్వెల్‌కు ఆయన కథ మాత్రమే అందిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు సుపర్ణ్‌ వర్మ ఈ సీక్వెల్‌కి దర్శకత్వం వహించబోతున్నారు. వెంకటేష్‌, రానా దగ్గుబాటి కాంబోలో వచ్చిన ‘రానా నాయుడు’కు సుపర్ణ్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పుడు జాంబీ రెడ్డి సీక్వెల్‌తో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. ఈ సీక్వెల్‌ను టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నారు.

➡️