‘లూసిఫర్ 2 : ఎంపురాన్’ చిత్రం తర్వాత మరో కొత్త ప్రాజెక్టులోకి పృథ్వీరాజ్ సుకుమారన్ వెళ్లిపోయారు. మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఆయనకు జోడీగా కరీనా కపూర్ నటిస్తున్నారు. శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటించబోతున్నారు. వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను మేఘనా గుల్జార్ తెరకెక్కించనున్నారు. ఆమె ఇప్పటికే రాజీ, చపాక్, సామ్‌బహదూర్ వంటి సినిమాలను తెరకెక్కించి బాలీవుడ్‌లో మంచి విజయాలను అందుకున్నారు. కాల్‌షీట్స్ లేని కారణంగా ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో పృథ్వీరాజ్, కరీనాకపూర్ ఎంట్రీ ఇచ్చారు.
