సినీ నటి హనీరోజ్‌కు లైంగిక వేధింపులు.. కేరళలో ప్రముఖ వ్యాపారి అరెస్ట్‌

Jan 8,2025 17:35 #abuse, #cases?, #honey rose

సినీ నటి హనీ రోజ్‌ని లైంగికంగా వేధించిన కేసులో కేరళకు చెందిన ప్రముఖ నగల వ్యాపారి బాబీ చెమ్మనూర్‌ అరెస్టయ్యారు. నటి ఫిర్యాదు అనంతరం కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ బుధవారం మధ్యాహ్నం బాబీ చెమ్మనూర్‌ను కస్టడీలోకి తీసుకుంది. హనీరోజ్‌ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం వయనాడ్‌లో ఆయనను అరెస్ట్‌ చేశారు. వ్యాపారి చెమ్మనూర్‌ అరెస్టుపై నటి హనీరోజ్‌ స్పందించారు. ఇది తనకు ఎంతో ప్రశాంతమైన రోజని అన్నారు. చెమ్మనూర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని సీఎం పినరయి విజయన్‌ దష్టికి తీసుకెళ్లగానే వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.

కాగా, హనీరోజ్‌ నాలుగు నెలల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. దాంతో తన కుటుంబమంతా ఆవేదన చెందినదని చెప్పారు.

➡️