ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప-2. రష్మిక కథానాయిక. పుష్ప సినిమాకి సీక్వెల్‌గా వస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ‘పుష్ప 2’ డిసెంబరు 5న సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమల్లో భాగంగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ను విడుదల చేసింది. ఈ సాంగ్‌లో శ్రీలీల, బన్నీ సూపర్ స్టెప్పులతో అలరించారు.
