Pushpa -2 : నేటి నుంచి థియేటర్లలో పుష్ప- 2 రీలోడెడ్‌ వెర్షన్‌ రిలీజ్‌

అమరావతి : నేటి నుంచి థియేటర్లలో పుష్ప 2 రీలోడెడ్‌ వెర్షన్‌ విడుదలవుతుంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ పుష్ప -2. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్‌ వైడ్‌ గా విడుదలయ్యింది. మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్ప ఇప్పటివరకు వరల్డ్‌ వైడ్‌ గా రూ.1832 కోట్లకు పైగా వసూలు చేసి అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. పుష్ప 2 కు ఒక్క హిందీలోనే రూ.800 కోట్లకు పైగా నెట్‌ కలెక్షన్స్‌ వచ్చాయి. ఇప్పటికి నార్త్‌ బెల్ట్‌ లో డీసెంట్‌ కలెక్షన్స్‌ తో పుష్ప -2 స్టడీగా సాగుతోంది. నేటి నుంచి థియేటర్లలో పుష్ప 2 రీలోడెడ్‌ వెర్షన్‌ విడుదలవుతుంది. ఇప్పటికే ఇండియాన్‌ సినిమాలోని అన్ని రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న పుష్ప రాజ్‌. తాజగా అత్యధిక కలెక్షన్స్‌ నమోదు చేసిన ఇండియాన్‌ సినిమాగా ఉన్న దంగల్‌ రికార్డును బద్దలు కొట్టడానికి మరోసారి వస్తున్నాడు. అందుకోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు మేకర్స్‌. పుష్ప -2 రిలీజ్‌ టైమ్‌ లో ఎడిటింగ్‌ లో తీసేసిన 20 నిమిషాల ఫుటేజ్‌ ను ఈ రోజు నుండి యాడ్‌ చేస్తూ రిలీజ్‌ చేయనున్నారు. వరల్డ్‌ వైడ్‌ గా పుష్ప 2 ప్రదర్శితమవుతున్న థియేటర్స్‌లో ఈ న్యూ వర్షన్‌ పుష్ప ను ప్రదర్శించనున్నారు. మరోవైపు నేటి నుండి ఈ సినిమా టికెట్‌ ధరలను మేకర్స్‌ తగ్గించారు. నైజాం లో పుష్ప రీలోడెడ్‌ వర్షన్‌ టికెట్‌ ధర సింగిల్‌ స్క్రీన్‌ లో రూ.112 గాను, మల్టీప్లెక్స్‌ లో రూ.150 గాను నిర్ణయిస్తూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అఫీషియల్‌ గా ప్రకటించింది.

➡️