‘పుష్ప 2’ సిండికేట్‌ సిద్ధప్ప లుక్‌ విడుదల

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా రానున్న ‘పుష్ప-2 ది రూల్‌’ సినిమా నుంచి సిండికేట్‌ సిద్ధప్పగా రావు రమేష్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. వెనుక మనుషులు, వర్షం.. పోస్టర్‌లోని సిద్ధప్పను హైలైట్‌ చేస్తున్నాయి. ‘పుష్ప’ పార్ట్‌ 1లో రావు రమేష్‌కు పెద్దగా నిడివి దక్కలేదు. పార్ట్‌ 2లో మాత్రం ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. పుష్ప, సిద్ధప్ప మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకోనున్నాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఆగస్ట్‌ 15న ఈ సినిమా విడుదల చేస్తామని మేకర్స్‌ గతంలో ప్రకటించారు.

➡️