తెల్లగా ఉంటే చాలు..

Mar 15,2025 21:59 #telugu movies

మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌ ఇండిస్టీ గురించి మాట్లాడారు. ‘నేను బ్యాడ్మింటన్‌ ఆడే టైమ్‌లో నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ నేను నో చెప్పాను. మన తెలుగు సినిమాల్లో నటించాలంటే తెల్లగా ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అవకాశాలు వచ్చేస్తాయి. నాకు అలా బోలెడన్ని ఛాన్సులు వచ్చినా చేయలేదు. కానీ నితిన్‌ కోసం గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేశాను. లక్కీగా అది మంచి హిట్‌ అయింది. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది’ అంటూ గుత్తా జ్వాల మాట్లాడారు.

➡️