‘ఎన్టీఆర్, ఎఎన్నార్ చేయాల్సినంత గొప్ప పాత్రలో నటించే అవకాశం ‘హరికథ’ సిరీస్‌తో నాకు దక్కింది. బాగా నటించి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంగా నటిస్తా’అని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ ‘హరికథ’ పేరుతో మరో వెబ్ సిరీస్‌ను రూపొందిస్తోంది. హాట్‌స్టార్ స్పెషల్స్‌గా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ దర్శకత్వం వహిస్తున్నారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనికరెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషశ్రీ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. హైదరాబాద్‌లో సోమవారంనాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రచయిత సురేష్ జై, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శశికిరణ్ నారాయణ, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తదితరులు మాట్లాడారు.