‘రాజు యాదవ్‌’ రియలిస్టిక్‌ మూవీ

May 15,2024 18:59 #New Movies Updates

”భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా’లో అలీకి రూ.కోటి లాటరీ తగులుతుంది. ఆ ఆనందంలో ఆయన నవ్వుతూనే చనిపోతారు. సినిమా అంతా నవ్వు ముఖంతోనే ఉంటారు. అలాగే క్రికెటర్‌ లక్ష్మీపతి బాలాజీకి జరిగిన సర్జరీ వల్ల ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లే కనిపిస్తుంది. ఇలాంటి లోపం ఉన్న వారి గురించి కథ రాస్తే బాగుంటుందని ‘రాజు యాదవ్‌’ స్క్రిప్ట్‌ రాశాను” అని డైరెక్టర్‌ కష్ణమాచారి చెప్పారు. గెటప్‌ శ్రీను హీరోగా నటించారు. కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కళ్లేపల్లి ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 17న సినిమా విడుదల కానున్న సందర్భంగా కృష్ణమాచారి మీడియాతో మాట్లాడారు. ’15 ఏళ్ల క్రితం ఇండిస్టీకి వచ్చాను. ‘నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం’ చిత్రాలకు దర్శకుడు వేణు ఊడుగుల వద్ద అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశాను. దర్శకుడిగా ‘రాజు యాదవ్‌’ నా తొలి చిత్రం. నాకు సహజత్వంతో కూడకున్న సినిమాలంటే ఇష్టం. ‘రాజు యాదవ్‌’ రియలిస్టిక్‌గా ఉంటుంది. గెటప్‌ శ్రీను కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం, సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. చంద్రబోస్‌ మా సినిమా కోసం ఓ పాట రాసి, పాడటం సంతోషంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని వివరించారు.

➡️