21న రకుల్‌ పెళ్లి..

Feb 13,2024 10:06 #marriage, #movies, #rakul

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ వివాహం ఈ నెల 21న గోవాలో జరగనుంది. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్‌ కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వేడుకకు టాలీవుడ్‌ నుంచి మంచు లక్ష్మితో పాటు ప్రగ్యా జైస్వాల్‌, సీరత్‌ కపూర్‌ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. రకుల్‌ ప్రస్తుతం హిందీలో ‘మేరీ పత్నీ కా’ రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

➡️